జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండలంలోని తాడిచర్ల గ్రామంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ పనుల వల్ల గ్రామ ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వాధీనం చేసుకున్న భూములకు సింగరేణి సంస్థ నష్టపరిహారం చెల్లించకపోవడం, బ్లాస్టింగ్లతో పంటలు, ఇళ్లు నాశనం అవ్వడం, ఓపెన్ కాస్ట్ వల్ల వచ్చే దుమ్ము, ధూళి వల్ల అనారోగ్య సమస్యలు వెరసి ఆ గ్రామస్థులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు.
అప్పుడు ఆనందం... ఇప్పుడు ఆవేదన
పదివేల జనాభా గల తాడిచర్లలో 12 సంవత్సరాల క్రితం ఓపెన్‌కాస్ట్ కోసం ఏపీ జెన్కో గ్రామస్థుల నుంచి భూముల స్వాధీనం కోరింది. మంచి ధరతో పాటు తమ పిల్లలకు ఉద్యోగాలొస్తాయని వారంతా ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 2500 ఎకరాల సాగు భూముల్లో కొన్నింటిని స్వాధీనం చేశారు. అనంతరం ఈ ప్రాంతం సింగరేణి ఆధీనంలోకి మారిపోయింది. ఓపెన్ కాస్ట్ పనులు ప్రారంభమైన తరువాత వారి కష్టాలు మొదలయ్యాయి. పేలుళ్లతో వారు ఉంటున్న ఇళ్లకు పగుళ్లు ఏర్పడి ఎప్పుడు కూలుతాయోనని భయం భయంగా కాలం గడుపుతున్నారు.
అనారోగ్య సమస్యలు