జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి సాగునీరందించే ఉద్దేశంతో కేసీఆర్ సర్కార్... రూ.70 కోట్లు ఖర్చు చేసి గోరికొత్తపల్లిలో కెనాల్ నిర్మించిందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఎస్సారెస్పీ డీబీఎం 38వ కెనాల్ ద్వారా ఈరోజు నీరు విడుదల చేశారు.
రేగొండ మండలానికి ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా నీటి విడుదల - ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గోరికొత్తపల్లిలో ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నీరు విడుదల చేశారు.
రేగొండ మండలానికి ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా నీటి విడుదల
రేగొండ మండలానికి 15 రోజుల పాటు నీటి విడుదల కొనసాగుతుందని తెలిపారు. ఎస్సారెస్పీ ద్వారా వచ్చే నీటితో కుంటలు, చెరువులు నింపుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు రెండు పంటలకు సాగునీరందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని నీరు విడుదల చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.