భూపాలపల్లి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం, వంద పడకల ఆస్పత్రి ఆవరణలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఆరో విడత హరితహారంలో భాగంగా 30 నిమిషాల్లో మూడు లక్షల మొక్కలు నాటాలన్నారు. ఇందుకు అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని సూచించారు.
'అందరూ కలిసొస్తే 30 నిమిషాల్లో ముడు లక్షల మొక్కలు నాటొచ్చు' - mal gandra venkata ramana reddy latest news
ఆరో విడత హరితహారంలో భాగంగా భూపాలపల్లి జిల్లాలో 30 నిమిషాల్లో మూడు లక్షల మొక్కలు నాటాలని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం, వంద పడకల ఆస్పత్రి ఆవరణలో ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు.
30 నిమిషాల్లో మూడు లక్షల మొక్కలు నాటాలి: గండ్ర
శనివారం మెగా ప్లాంటేషన్ డేగా నామకరణం చేశామని.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఆజిమ్, జిల్లా అటవీ శాఖ అధికారి పురుషోత్తం, పంచాయతీరాజ్ అధికారి చంద్రమౌళి పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కంటోన్మెంట్లోనూ ప్రభుత్వ పథకాల అమలు: తలసాని, మల్లారెడ్డి