జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేంద్రంలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దాయకర్‌రావు పాల్గొన్నారు. కృష్ణకాలనిలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెత్త, పందుల బెడదను నివారించాలని.. కాలనీల్లో పచ్చదనం, పరిశుభ్రత ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరు పట్టుదలతో పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. పనిచేయని కౌన్సిలర్లును పదవి నుంచి తీసివేస్తామని హెచ్చరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఐక్యతతో పని చేసి పట్టణాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజిమ్, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పనిచేయక పోతే పదవి నుంచి తీసేస్తాం: ఎర్రబెల్లి - errabelli latest speech
అధికారులు, ప్రజాప్రతినిధుల పనితీరులో అలసత్వం కనిపిస్తే పదవి నుంచి తీసేస్తామని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు. భూపాలపల్లిలో పట్టణ కేంద్రంలో నిర్వహించిన పట్టణప్రగతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
భూపాలపల్లి జిల్లాలో కేంద్రంలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమం