జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ రెండో పంపు ట్రయల్‌ను ఇంజినీరింగ్ అధికారులు విజయవంతంగా నిర్వహించారు. సుమారు అరగంట పాటు పంపు నడిపారు. నిన్న 1,3,4 పంపులు నడిపిస్తూ ఆరు పైపుల ద్వారా జలాలను అన్నారం బ్యారేజ్‌కు తరలించారు. రెండో పంపును నేడు మరోసారి నడిపించనున్నారు. కన్నెపల్లి పంపుహౌస్ వద్ద 6 టీఏంసీ, అన్నారం బ్యారేజ్ వద్ద 6.11 టీఏంసీల నీటి నిల్వ ఉంది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 4.40 మీటర్ల నీటి మట్టం ఉంది. ఇవాళ ఏడో పంపును కాళేశ్వరం ఇంజినీరింగ్ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నీటి నిల్వ నిలకడగా కొనసాగుతుంది. నిన్న సాయంత్రం వరకు 7.0 టీఏంసీల నీటి నిల్వ నమోదు అయింది.
కన్నెపల్లి రెండో పంపు ట్రయల్ రన్ విజయవంతం - kaleswaram
కాళేశ్వరం ప్రాజెక్టులో కన్నెపల్లి పంపుహౌస్ రెండో పంపు ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ నెల 6 నుంచి ఒక్కో పంపు ట్రయల్ రన్ చేస్తూ నీటిని ఎత్తి పోస్తుండగా... ట్రయల్ రన్ పూర్తి కావడం వల్ల రెండో పంపు ద్వారా కూడా నీటిని ఎత్తిపోయనున్నారు.
పంపు ట్రయల్ రన్