జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పీహెచ్సీలో కొవిడ్ వ్యాక్సినేషన్‌ను జాయింట్ కలెక్టర్ స్వర్ణలత, మున్సిపల్ ఛైర్మన్ సెగ్గం వెంకట రాణితో కలిసి ప్రారంభించారు. మొదటి దఫా 56 వ్యాక్సిన్స్ రాగా.. భూపాలపల్లి, మహదేవ్ పూర్, చిట్యాల ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందించనున్నట్లు డీఎంహెచ్ఓ వెల్లడించారు.
వ్యాక్సిన్ వచ్చినా.. జాగ్రత్తలు తప్పనిసరి: జేసీ స్వర్ణలత - Bhupalpally District Latest News
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పీహెచ్సీలో కొవిడ్ వ్యాక్సినేషన్‌ను జాయింట్ కలెక్టర్ స్వర్ణలత ప్రారంభించారు. మొదటి విడతలో భూపాలపల్లి, మహదేవ్ పూర్, చిట్యాల ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకా వేయనున్నట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. ఎవరూ అజాగ్రత్తగా ఉండరాదని సూచించారు.
పీహెచ్సీలో కొవిడ్ వ్యాక్సినేషన్
వ్యాక్సిన్ వచ్చినా.. జాగ్రత్తలు తప్పనిసరి: జేసీ స్వర్ణలత
రోజుకి ఒక్కో కేంద్రంలో 30మందికి చొప్పున మొత్తం 90 మంది ఫ్రంట్ లైన్ ఉద్యోగులు, వర్కర్లకు వ్యాక్సిన్ వేయనున్నట్లు డీఎంహెచ్ఓ సుదార్ సింగ్ తెలిపారు. వ్యాక్సిన్ వచ్చింది కదా అని ఎవరూ అజాగ్రత్తగా ఉండరాదన్నారు. ప్రతీ ఒక్కరు విధిగా మాస్క్ ధరిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.