గ్రామ పంచాయతీలు మినీ కలెక్టరేట్‌గా పని చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం సూచించారు. మొగుళ్లపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో రియల్ చెక్ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై సంబంధిత శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ నిధులను సక్రమంగా ఉపయోగిస్తూ... అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అర్హులైన వారందరికీ అందేలా చూసి ప్రజలకు నమ్మకం కల్పించటమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు.
'గ్రామపంచాయతీలు మినీ కలెక్టరేట్‌గా పనిచేయాలి' - lock down update
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో రియల్ చెక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాను గుడుంబా రహితంగా మార్చేందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు.
'గ్రామపంచాయతీలు మినీ కలెక్టరేట్‌గా పనిచేయాలి'
మూడవ దశలో ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. గుడుంబా రహిత జిల్లాగా మార్చేందుకు ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుడి పహాడ్ గ్రామ పంచాయతీకి కలెక్టర్ నిధుల నుంచి ప్రత్యేకంగా మంజూరు చేసిన ట్రాక్టర్‌ను సర్పంచ్‌కు అందజేశారు.