తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడిగడ్డ బ్యారేజి వద్ద 65 గేట్లు ఎత్తివేత

రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజి వద్ద 65 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నందున గ్రావిటీ ద్వారా ఎత్తి పోతలను నిలిపేశారు. వరదనీటితో జలశయం నిండు కుండను తలపిస్తోంది.

By

Published : Aug 2, 2019, 10:37 AM IST

మేడిగడ్డ బ్యారేజి వద్ద 65 గేట్లు ఎత్తివేత.

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజి వద్ద 65 గేట్లను ఇంజినీరింగ్ అధికారులు తెరిచి ఉంచారు. బ్యారేజీ నుంచి భారీగా వరద నీటిని దిగువకు పంపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. గోదావరి, ప్రాణహిత నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజిలోకి 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తున్నందు వల్ల వాటిని దిగువకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మేడిగడ వద్ద 6 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కన్నెపల్లి పంపు హౌస్​లోని పంపులు గురువారం నాడు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో బ్యారేజీలు, జలాశయాల వద్ద నీరు సమృద్ధిగా ఉండడం వల్ల మంగళవారం నుంచి పంపులను నిలిపివేసి గ్రావిటీ ద్వారా జలాల ఎత్తిపోతలను ఆపేశారు. ఇప్పటికీ కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద 6, అన్నారం బ్యారేజీ వద్ద 8 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

మేడిగడ్డ బ్యారేజి వద్ద 65 గేట్లు ఎత్తివేత.

ABOUT THE AUTHOR

...view details