తెలంగాణ

telangana

ETV Bharat / state

'శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించేది లేదు'

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇన్‌ఛార్జ్ ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ కాటారం పోలీస్ స్టేషన్‌తో పాటు.. డీఎస్పీ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు, పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను పోలీస్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Jayashankar Bhupalpally district in-charge SP Dr Sangram Singh Patil along conducted a surprise inspection of the DSP's office.
'శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దు'

By

Published : Jan 30, 2021, 7:41 AM IST

శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని.. జయశంకర్ భూపాలపల్లి ఇన్‌ఛార్జ్ ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ హెచ్చరించారు. జిల్లాలోని కాటారం పోలీస్ స్టేషన్‌తో పాటు.. డీఎస్పీ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

నిరంతరం అప్రమత్తతతో..

తనిఖీల్లో భాగంగా.. పలు రికార్డులు పరిశీలించిన ఎస్పీ.. ఆయా పోలీస్‌ స్టేషన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ .. పోలీసు అధికారులు, సిబ్బంది అటవీ ప్రభావిత ప్రాంతాలలో నిరంతరం అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించవద్దని సూచించిన ఎస్పీ.. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండొద్దని తెలిపారు. స్టేషన్‌కు వచ్చే వారి పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి.. ఫిర్యాదులను సత్వరమే విచారణ చేపట్టాలన్నారు.

ఇదీ చదవండి:తెలంగాణ, కర్ణాటకలో ఆ నేలలున్నాయి: నిరంజన్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details