తెలంగాణ

telangana

ETV Bharat / state

బాధిత రైతు కుటుంబాలకు త్వరలోనే పరిహారం: కలెక్టర్ - Collector Krishna Aditya inspection

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పాలనాధికారి కృష్ణ ఆదిత్య... కలెక్టర్​ కార్యాలయంలోని వివిధ సెక్షన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆత్మహత్య చేసుకున్న 13 మంది రైతుల కుటుంబాలు పరిహారం కోసం ఎదురు చూస్తున్నాయని వారికి పరిహారం త్వరగా అందించాలని అధికారులను ఆదేశించారు.

బాధిత కుటుంబాలకు పరిహారం త్వరగా అందాలి: కలెక్టర్
బాధిత కుటుంబాలకు పరిహారం త్వరగా అందాలి: కలెక్టర్

By

Published : Nov 19, 2020, 3:05 PM IST

ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు త్వరగా పరిహారం చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని భూపాలపల్లి కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య... కార్యాలయంలోని వివిధ సెక్షన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

జిల్లాలోని ఆత్మహత్య చేసుకున్న 13 మంది రైతుల కుటుంబాలు పరిహారం కోసం ఎదురు చూస్తున్నాయని... వారికి త్వరగా పరిహారం అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. కలెక్టర్​ కార్యాలయ రికార్డు రూమ్​ను పరిశీలించారు. పనులు పూర్తైన ఫైళ్లను, ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమాల ఫైళ్లను వేరువేరుగా ఉంచాలని తెలిపారు. భవనంలోని సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని ఏఓ మహేశ్​బాబును ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details