భూపాలపల్లి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (బుడా) ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైంది. పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో కొత్త జిల్లాలను రెండేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. భూపాలపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు భూపాలపల్లి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(బుడా) ఏర్పాటుకు అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది.
2016 నవంబరులోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. పట్టణం నుంచి చుట్టూ ఉన్న 10 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలతో బుడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఆ నివేదికను అప్పటి జిల్లా కలెక్టర్ మురళి రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శికి పంపించారు. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని నగరాలు, మున్సిపాలిటీలలో పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసింది.