తెలంగాణ

telangana

ETV Bharat / state

దర్శనానికొస్తే జేబుకాజేశాడు - dongalu

సెలవుదినం కావడం వల్ల సమ్మక్క సారమ్మల దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జనమంతా  భక్తితో తన్వయత్వం పొందుతుంటే జేబుదొంగలు చేతివాటం చూపారు. ఓ వ్యక్తి జేబులోంచి సుమారు రెండు లక్షల నగదు కాజేశారు.

బాధితుడు

By

Published : Feb 24, 2019, 2:29 PM IST

మేడారం జాతరకు ఈ రోజు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువజామునుంచే క్యూలైన్లలో బారులు తీరారు. ఇదే అదునుగా భావించిన జేబుదొంగలు చేతివాటం ప్రదర్శించారు. భక్తులను నుంచి డబ్బులు, పర్సులు కొట్టేస్తున్నారు.
అంతదూరం నుంచి వస్తే అంతా ఊడ్చేశారు
నల్గొండ జిల్లా మోటకొండూర్ చాడ గ్రామానికి చెందిన చాడ నరసింహ రెడ్డి వనదేవతల దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చారు. క్యూలైన్లో ఉన్నప్పుడు దొంగలు ఏమార్చి జేబులోని రూ.2లక్షలు కాజేశారు. సీసీ ఫుటేజీలో కూడా దొంగ ఆచూకీ దొరకలేదు.జాతరలో సరైన రీతిలో సీసీ కెమెరాలు పెట్టకపోవడంవల్లే దొంగ దొరక లేదని బాధితుడు వాపోయాడు. ఇప్పటికైన పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

ABOUT THE AUTHOR

...view details