జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వైద్యురాలి వేధింపులు తట్టుకోలేక ఏఎన్‌ఎంలు ధర్నాకు దిగారు. జిల్లాలోని కాటారం మండల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్‌ఎంలు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జయశంకర్ విగ్రహం ఎదురుగా మంగళవారం మోకాళ్లపై కూర్చుండి మూతులకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఆ వైద్యురాలుంటే తాము పనిచేయలేమని జయశంకర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేస్తూ ఆందోళనకు దిగారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.
మోకాళ్లపై కూర్చుండి నిరసన తెలిపిన ఏఎన్‌ఎంలు - anms
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వైద్యురాలు వేధింపులు తట్టుకోలేక ఏఎన్‌ఎంలు వినూత్న నిరసన చేపట్టారు. మోకాళ్లపై కూర్చుండి మూతికి నల్ల రిబ్బన్లు కట్టుకొని ఆందోళన చేశారు.
మోకాళ్లపై కూర్చుండి నిరసన తెలుపుతున్న ఏఎన్‌ఎంలు