crop loss: వర్షాలు, వడగళ్లు, అనావృష్టి వంటి విపత్తులొచ్చి పంటలు దెబ్బతింటే రైతులకు ఏ విధంగానూ సాయం అందడం లేదు. వరసగా మూడో ఏడాది అకాల వర్షాలు, వడగళ్లతో రైతులు పెద్దయెత్తున నష్టపోయారు. రాష్ట్ర ఖజానా నుంచి నిధులిస్తేనే ఇప్పుడు వారికి సాయం అందే పరిస్థితులున్నాయి. గత ఆగస్టు నుంచి అక్టోబరు వరకూ అధిక వర్షాలతో లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న, పెసర, మినుము వంటి పంటల దిగుబడి బాగా తగ్గిపోయింది. అప్పుడు రైతువారీగా నష్టం వివరాలను కేంద్రానికి వ్యవసాయశాఖ పంపలేదు. ఈ నెలలో వడగళ్ల వర్షాలతో వేలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. ఇప్పుడూ ఇంతవరకూ కేంద్రానికి నష్టాల వివరాలేమీ ఇవ్వలేదు. ఇలా పంపితే కనీసం కేంద్ర బృందాలు వచ్చి నష్టాలను అంచనా వేసి, రైతులకు సాయం అందజేయాల్సిందిగా కేంద్రానికి సిఫార్సు చేసే వీలుంటుంది. వాటి ఆధారంగా కేంద్రం పెట్టుబడి రాయితీ కింద సాయం అందించే అవకాశం ఉంటుంది.ఆ దిశగా చొరవ లేదు. ఫలితంగా గత మూడేళ్లుగా ఏటా వానాకాలం, యాసంగిలో వర్షాలు, వడగళ్లతో పంటలు దెబ్బతింటున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతులకేమీ సాయం అందలేదు.
హైకోర్టు ఆదేశాలు ఇచ్చి మూణ్నెల్లు
high court on farmers: 2020 వానాకాలంలో అధిక వర్షాల వల్ల 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. కానీ రైతులకు సాయం ఏమీ అందలేదు. దీనిపై రైతు స్వరాజ్య వేదిక సంస్థ హైకోర్టులో కేసు వేయడంతో విచారణ జరిపి 4 నెలల్లోగా రైతులకు సాయం అందించాలని 2021 సెప్టెంబరులో హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు విపత్తు నిర్వహణ చట్టం కింద సాయం చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని కూడా హైకోర్టు పేర్కొంది. హైకోర్టు చెప్పి 3 నెలలు దాటినా ఇంకా ప్రభుత్వం స్పందించలేదని రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి విస్సా కిరణ్‌కుమార్ తెలిపారు. అంతకుముందు 2019 వానాకాలంలో కూడా అధిక వర్షాల వల్ల 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా ఎలాంటి సాయం చేయలేదు.
వందల శాతం అదనంగా వర్షం కురిసినా..