పదవులు ముఖ్యం కాదని.. జిల్లా అభివృద్ధి కోసమే పార్టీ మారానని భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ వీడి తెరాసలో చేరడంపై గండ్ర ఆయన సతీమణి కంటతడి పెట్టారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. నమ్మిన వారిని కాపాడుకుంటామన్నారు. జడ్పీ ఛైర్మన్ పదవి కోసం పార్టీ మారామనేది వాస్తవం కాదని వెంకటరమణా రెడ్డి తెలిపారు. రాజకీయ భిక్షపెట్టిన సోనియా, రాహుల్ గాంధీకి రుణపడి ఉంటామన్నారు.
గండ్ర దంపతుల కంటతడి - congress
భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి, ఆయన సతీమణి జ్యోతి కంటతడి పెట్టారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారు కార్యకర్తలతో సమావేశమయ్యారు. పదవులు ముఖ్యం కాదని జిల్లా అభివృద్ధికే పార్టీ మారుతున్నట్లు గండ్ర చెప్పారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు.
వెంకటరమణా రెడ్డి