మేడిగడ్డ బ్యారేజీలో 4 గేట్లు మూసివేత
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో నాలుగు గేట్లను మూసి వేశారు. మూడ్రోజులుగా తెరిచి ఉన్న గేట్ల ద్వారా 10,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. ఈ క్రమంలోమేడిగడ్డ బ్యారేజీ వద్ద 96.5 కిలోమీటర్ల మేర ప్రవాహంతో 7 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
four gates of medigadda barrage has been closed
మూడ్రోజులుగా తెరిచి ఉన్న మేడిగడ్డ బ్యారేజీలోని నాలుగు గేట్లను ఆదివారం సాయంత్రం అధికారులు మూసివేశారు. ఈ జలాశయంలో ప్రస్తుతం 7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు, కన్నెపల్లి పంపుహౌస్, గ్రావిటీ కెనాల్ నిర్మాణాలను జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు సందర్శించారు. మేడిగడ్డ నిర్మాణాన్ని వీక్షించి, నీటి ప్రవాహాన్ని పరిశీలించారు.
- ఇదీ చూడండి : నేడే చంద్రయాన్-2 ప్రయోగం