Farmers dharna at Bhupalapally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో దళారులు, అధికారులు మోసం చేస్తున్నారని రైతులు రహదారిపై కూర్చోని ధర్నా చేశారు. పీఏసీఎస్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అధిక సంఖ్యలో ధాన్యాన్ని తీసుకొచ్చి పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆందోళన చేస్తున్నారు.
అధికారుల దోపిడి: అధికారులు, మిల్లర్లు మాయాజాలం చేసి రైతుల వద్ద నుంచి బస్తాకు మూడు కిలోలు, క్వింటాకు 6 కిలోల చొప్పున ధాన్యాన్ని అధికంగా తూకం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 8 కిలోల ధాన్యం కటింగుకు ఒప్పుకుంటేనే ధాన్యాన్ని దించుతామని మిల్లర్లు అంటున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు.