తెలంగాణ

telangana

ETV Bharat / state

అధికారులు లంచాలు అడుగుతున్నారని ఆ రైతు ఏం చేశాడంటే.. - భూపాలపల్లిలో రైతు వినూత్న ధర్నా

తన భూమికి పట్టా చేయాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు లంచాలు అడుగుతున్నారంటూ జయశంకర్​ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైనిపాకలో రఘుపతి అనే రైతు రోడ్డుకి అడ్డంగా మంచం వేసుకుని నిరాహారదీక్ష చేపట్టారు.

Farmer innovative protest as officials asking for bribes
అధికారులు లంచాలు అడుగుతున్నారంటూ రైతు వినూత్న నిరసన

By

Published : Sep 28, 2020, 7:30 PM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైనిపాకలో రఘుపతి అనే రైతు వినూత్నంగా నిరసన చేపట్టారు. భూమికి పట్టాలు కావట్లేదని రోడ్డుపై మంచం వేసుకుని నిరాహారదీక్ష చేపట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకుని పని చేయట్లేదని.. ఇంకో రూ. 50- 60 వేలు లంచం ఇస్తేనే ఐదు ఎకరాల భూమికి పట్టా చేస్తామని రెవెన్యూ అధికారులు అన్నారని రఘుపతి వాపోయారు.

తన భూమి విషయమై ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి తన గోడు చెప్పుకున్నా ఎవరూ పట్టించుకోలేదని.. అధికారులతో కుమ్మక్కై లంచాలకు ఆశపడి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన చెందారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. తన భూమికి పట్టా చేయించి.. పాసుబుక్ అందేలా చేయాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:వరుస ఎన్నికలపై కారు నజర్‌.. పకడ్బందీ వ్యూహంతో కార్యాచరణ

ABOUT THE AUTHOR

...view details