జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం చెల్పూర్ ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. తాము పండించిన వరి, ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం రహదారిపై రాస్తారోకో చేపట్టగా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు అక్కడకు చేరుకుని ధర్నాను అదుపులోకి తెచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి షరతులు లేకుండా పంటను కొనాలని కోరారు.
పంటను కొనుగోలు చేయాలంటూ రైతుల ధర్నా - faarmers protest at jayashankar bhupalpally
పండించిన వరి, ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్ ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు.
పంటను కొనుగోలు చేయాలంటూ రైతుల ధర్నా