తెలంగాణ

telangana

ETV Bharat / state

చిన్న జాతరకు అంతా సిద్ధం..! - SEETHAKKA

సమ్మక్క-సారక్క చిన్న జాతరకు ముహూర్తం దగ్గరపడింది. ఈనెల 20 నుంచి ఏర్పాట్లు చేయనున్నారు. ఏ లోటు రాకుండా చూడాలని సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఆదేశించారు.

జాతరకు అధికారుల కసరత్తు

By

Published : Feb 18, 2019, 8:53 PM IST

జాతరకు అధికారుల కసరత్తు
ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ చిన్న జాతర ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే సీతక్క, జిల్లా ఎస్పీ, వైద్యం, అటవీ, రవాణా శాఖతో సహా అన్ని విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈనెల 20 నుంచి 23 వరకు జరిగే జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
జాతరలో ప్లాస్టిక్ కవర్లు, జంతు చర్మాలను వెంటనే తొలగించేలా చర్యలు చేపట్టాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరారు. శానిటేషన్, రవాణా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
జాతరకు 250 మందితో జిల్లా పోలీస్ యంత్రాగం భద్రత కల్పించనుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక దళాలను కూడా సిద్ధం చేసినట్లు ఇంఛార్జీ ఎస్పీ భాస్కరన్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details