రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయరంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి కొనియాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధర్మారావుపేటలో రూ. 35 లక్షలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అదనపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. వర్షాలు కురవాలంటే ప్రతి ఇంటికి రెండు మొక్కలు నాటి ఆకుపచ్చ తెలంగాణను తయారుచేయాలని కోరారు.
దేశవ్యాప్తంగా రైతుబంధు గురించే చర్చ - mla
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన రైతుబంధు గురించి దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
రైతుబంధు