జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం ఎడపల్లి వాసులు కరోనా కలకలంతో భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే 28 మంది వైరస్ బారిన పడడంతో గ్రామస్థులు వణికిపోతున్నారు. ఇటీవల ఎడపల్లిలో ఓ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం తరలివచ్చారు.
ఆ ఊరిలో 28 మందికి సోకిన వైరస్ - కరోనా కేసులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడపల్లి వాసులు కరోనా భయంతో వణికిపోతున్నారు. ఇప్పటివరకు 28 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ కాగా... వైద్యులు ఇంకా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇతరులు గ్రామంలోకి రాకుండా అధికారులు రాకపోకలు నిలిపివేశారు.
ఈ కార్యక్రమం అనంతరం ఎడపల్లికి చెందిన ఓ విద్యార్థినికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. అప్రమత్తమైన వైద్యాధికారులు.. వారం రోజులుగా గ్రామంలో కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే గ్రామ సర్పంచి సహా 28 మంది వైరస్ బారినపడ్డారు. జిల్లా వైద్యాధికారులు గ్రామానికి చేరుకొని సలహాలు, సూచనలు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని హోమ్ ఐసోలేషన్ చేసి చికిత్స అందిస్తున్నారు. గ్రామస్థులు స్వీయ నిర్భందం విధించుకోగా.. రాకపోకలు సాగకుండా కర్రలతో కంచె ఏర్పాటు చేశారు.
ఇదీచూడండి:ఒకే ఇంట్లో 13 మందికి కరోనా నిర్ధరణ