జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇప్పటివరకు ప్రభుత్వ సహాయం పొందని వలస కూలీలను త్వరగా గుర్తించి వారికి సాయం అందించాలని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో తహసీల్దార్లతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో వలస కూలీలకు ప్రభుత్వం తరఫున సహాయం అందించి ఆ వివరాలను ఆన్లైన్లో ఎలా పొందుపరచాలో వివరించారు. ఏ ఒక్క వలస కూలీకూడా ఆకలితో అలమటించకుండా చూసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
5 నిమిషాల పాటు చప్పట్లు కొట్టండి: కలెక్టర్ అబ్దుల్అజీం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ సాయం అందని వలసకూలీలను గుర్తించి వారికి సహాయం అందించాలని తహసీల్దార్లకు జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం ఆదేశించారు. ఏ ఒక్కరూ పస్తులతో పండుకోకుండా చూసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
5 నిమిషాల పాటు చప్పట్లు కొట్టండి: కలెక్టర్ అబ్దుల్అజీం
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో అహర్నిశలు పోరాటుతున్న వైద్యులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితర శాఖల అధికారులు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. వారి సేవలకు ప్రోత్సహకంగా జిల్లా ప్రజలంతా ప్రతి మంగళవారం, శుక్రవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి 6.35 నిమిషాల వరకు.. 5 నిమిషాల పాటు ఎవరి ఇంట్లో వారు.. వారివారి వాకిళ్లముందుకు వచ్చి చప్పట్లు కొట్టాలని ఆయన ప్రజలను కోరారు.
ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్