తెలంగాణ

telangana

ETV Bharat / state

కాళేశ్వరం పరిశీలనలో స్మిత - medigadda

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సీఎంఓ అధికారి స్మిత సభర్వాల్​ పరిశీలించారు. నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతున్నాయని కూలీలు,యంత్రాల సంఖ్యను పెంచి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

కాళేశ్వరం పనుల పరిశీలన

By

Published : Mar 6, 2019, 5:41 PM IST

కాళేశ్వరం పనుల పరిశీలన
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ వద్ద సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్యారేజీ, కరకట్టల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని అధికారులపై అసహనం వ్యక్తం చేసారు.. పనుల్లో మరింత వేగం పెంచి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

అనంతరం కన్నెపల్లి వద్ద నిర్మిస్తున్న పంపుహౌస్ నిర్మాణ పనులను, గ్రావిటి కాల్వలోకి నీటిని పంపించే పైపుల నిర్మాణ పనులను పరిశీలించారు. మార్చి 30 వరకు నిర్మాణ పనులు పూర్తికావాలని అధికారులకు, సంస్థ ప్రతినిధులకు స్మితా సబర్వాల్ సూచించారు. ఆమెతో పాటు సీఎంఓ ఓఎస్డీ దేశ్ పాండే, ఇతర అధికారులు వున్నారు.

ABOUT THE AUTHOR

...view details