తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల పురోగతిని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డలో 85 గేట్లకు గానూ 65 గేట్లు పూర్తయ్యాయని తెలిపారు. మిగతా 20 గేట్ల పనులు పురోగతిలో ఉన్నట్లు వివరించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పనిచేస్తున్న కూలీలకు ఎండ దెబ్బ తగలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కన్నపల్లి పంప్ హౌస్ పనులను పరిశీలించారు. మోటార్ల బిగింపు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. వెంటనే వెట్‌రన్‌కు సిద్ధం చేయాలని చెప్పారు.
కాళేశ్వరం పురోగతిని పరిశీలించిన స్మితా సబర్వాల్
కాళేశ్వరం ఎత్తిపోతల పనులను ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
కాళేశ్వరం పురోగతిని పరిశీలించిన స్మితా సబర్వాల్