కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ గేట్లను అధికారులు మూసివేశారు. 3 రోజులుగా గేట్లను తెరిచి నీటిని కిందకు వదిలారు. ఆదివారం 10 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్లింది. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ వద్ద 7 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 4 రోజుల విరామం అనంతరం కన్నెపల్లి పంపుహౌస్‌లోని 3, 4 పంపుల ద్వారా గ్రావిటీ కాలువలోకి నీటిని ఎత్తిపోశారు. పంపులు ఆటోమేషన్ పద్ధతిలో పనిచేస్తున్నాయి. అన్నారం పంపుహౌస్ రెండో పంపునకు ఇవాళ వెట్‌రన్ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం అన్నారం బ్యారేజీలో 5.7 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
'మేడిగడ్డ బ్యారేజీ గేట్లు మూసివేత' - medigadda barrage
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీలో గేట్లను మూసివేశారు. నాలుగు రోజుల విరామం అనంతరం కన్నెపల్లిలో 3, 4 పంపులు తిరిగి ప్రారంభమయ్యాయి. అన్నారం రెండో పంపునకు ఇవాళ వెట్‌రన్ నిర్వహించనున్నారు.
'మేడిగడ్డ బ్యారేజి గేట్లు మూసివేత'