విస్తరణ...ఈగని133.38 హెక్టార్లలో విస్తరించింది. 600 మీటర్ల లోతు వరకు ఇక్కడ తవ్వకాలు జరిపారు. 320 మంది ఉద్యోగులు శ్రమించి 11 ఏళ్లపాటు 9.28 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీశారు. బొగ్గుతోపాటు దాదాపుగా 981 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని బయటకు తీశారు. జీఆర్ఎన్ కంపెనీ ఈ గనిని నిర్వహించింది. చుట్టుపక్కల గ్రామ ప్రజలు పలుమార్లు ఓపెన్‌కాస్ట్ గనిని మూసివేయాలని అందోళనలు చేశారు. జనాల నిరసనలకు తోడు గని జీవితకాలం దృష్ట్యా అధికారులు ఓపెన్‌కాస్ట్‌ను మూసివేస్తున్నమని వెల్లడించారు.
సింగరేణి ఓపెన్‌కాస్ట్ మూసేశారు
సింగరేణి భూపాలపల్లి ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. 11 సంవత్సరాల పాటు నిరంతరాయంగా సేవలు అందించిన గనిని మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు. దీని నుంచి దాదాపు 9.28 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీశారు.
ఓపెన్‌కాస్ట్ గని మూసివేత
ఇవీ చూడండి:నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం