జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముత్తారం మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి కేశవపూర్ వద్ద పెద్దవాగులో వంతెన పైనుంచి నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. మధ్యాహ్నానికి కొద్దిగా నీటి ప్రవాహం తగ్గడం వల్ల వాహనాల రాకపోకలు మెుదలయ్యాయి. మేడారం సమ్మక్క సారక్కల దర్శనానికి వెళ్తున్న భక్తులతో కూడిన ఓ ప్రైవేటు బస్సు వంతెనను దాటే క్రమంలో మధ్యలోనే ఆగిపోయింది. అందులో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ప్రవాహం మధ్యలో ఆగిపోయిన బస్సును లారీకి తాడు కట్టి స్థానికులు బయటకు లాగారు. బస్సు సురక్షితంగా బయట పడడం వల్ల ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో బస్సులో 22మంది ఉన్నారు. హైదరాబాద్ నుంచి కాళేశ్వరం వచ్చి... అక్కడ నుంచి కాటారం మీదుగా మేడారం వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
వాగులో చిక్కుకున్న బస్సు... కాపాడిన స్థానికులు - medaram
మేడారం సమ్మక్క సారక్కల దర్శనానికి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేశవపూర్ వద్ద గల పెద్దవాగులో చిక్కుకుంది. ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
వాగులో చిక్కుకున్న బస్సు... కాపాడిన స్థానికులు