తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఓటమి భయంతో తెరాస నాయకులు డబ్బులు పంచుతున్నారు' - భాజపా నాయకుల ఆందోళన

ఎన్నికల్లో ఓడిపోతారనే భయంతో తెరాస నాయకులు డబ్బులు పంచుతున్నారని భాజపా నాయకులు ఆరోపించారు. రేగొండలో బహిరంగంగా డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కీర్తి ఆందోళన వ్యక్తం చేశారు.

bjp-leaders-protest-and-allegations-on-trs-at-regonda
'ఓటమి భయంతోనే తెరాస నాయకులు డబ్బులు పంచుతున్నారు'

By

Published : Mar 14, 2021, 3:49 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ పోలింగ్ కేంద్రం వద్ద భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. రేగొండ శివారులో ఉన్న ఫంక్షన్ హాల్​లో తెరాస నాయకులు బహిరంగంగా డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. పోలీసులకు చెప్పినా పట్టించుకోవడంలేదని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కీర్తి ఆందోళన వ్యక్తం చేశారు.

ఓడిపోతారనే భయంతో విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. పోలీసులు వారిని అరెస్టు చేయకుండా వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.

ఇదీ చూడండి:ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రయత్నాలు: బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details