జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఏఎన్ఎమ్లు నిరసన బాట పట్టారు. పీహెచ్సీలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఉమాదేవి తమను వేధింపులకు గురిచేస్తుందన్నారు. చెప్పినట్టు వినకుంటే గుంజీలు తీయిస్తూ.. బెంచీల కింద కూర్చోబెడుతుందని ఆరోపిస్తున్నారు. వెంటనే ఉమాదేవిపై చర్యలు తీసుకోవాలని అంబేడ్కర్, జయశంకర్ విగ్రహాల వద్ద ఏఎన్ఎమ్లు మూతికి నల్లగుడ్డ కట్టుకుని ఆందోళనకు దిగారు.
'ఏఎన్ఎమ్లను వేధింపులకు గురిచేస్తున్న వైద్యురాలు' - anms
తోటి ఆడవారు అని చూడకుండా గుంజీలు తీయిస్తూ, బెంచీలు కింద కూర్చోబెడుతూ ఏఎన్ఎమ్లను నానా ఇబ్బంది పెడుతోంది ఓ డాక్టర్. వేధింపులకు గురిచేస్తున్న ఆ డాక్టర్ మాకొద్దు అంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఏఎన్ఎమ్లు ఆందోళనకు దిగారు.
'ఏఎన్ఎమ్లను వేధింపులకు గురిచేస్తున్న వైద్యురాలు'