తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడిగడ్డ 65, అన్నారంలో 9 గేట్లు ఎత్తివేత - 9 గేట్లు

కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలు, పంపుహౌజ్​ల వద్ద జలాశయాలు కళకళలాడుతున్నాయి. ప్రవాహం పెరగడంతో మేడిగడ్డ వద్ద 65, అన్నారం బ్యారేజి వద్ద 9 గేట్లను ఎత్తివేశారు.

మేడిగడ్డ 65 గేట్లు ఎత్తివేత

By

Published : Aug 3, 2019, 10:48 AM IST

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజి గేట్లను తెరిచి ఉంచారు. మేడిగడ్డ బ్యారేజి వద్ద 65 గేట్లు ఎత్తి ఉంచారు. ఇన్​ఫ్లో 5.27 లక్షల క్యూసెక్కుల నీటి వరద వస్తుండగా అవుట్​ఫ్లో 5.27 లక్షల క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే అన్నారం బ్యారేజిలో 9 గేట్లు వేశారు. గత 5 రోజుల నుంచి కన్నెపల్లి పంపుహౌజ్​ పంపులు నిలిచిపోయాయి. మేడిగడ్డ బ్యారేజి వద్ద 4.51, అన్నారం బ్యారేజి వద్ద 9.25, కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద 8.0 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

మేడిగడ్డ 65, అన్నారంలో 9 గేట్లు ఎత్తివేత

ABOUT THE AUTHOR

...view details