జనగామలోని ఎన్ఎమ్ఆర్ గార్డెన్లో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ కె.నిఖిల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని అన్ని శాఖల మహిళలు, కౌన్సిలర్లు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని రంగాల్లో మహిళల సాధికారతకు తోడ్పడాలని ఆమె తెలిపారు. ఆడమగ అన్న వైఖరిని దూరం చేయాలని ఇద్దరిని సమానంగా చూడాని సూచించారు.
స్త్రీ శిశు సంక్షేమ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాలు - స్త్రీ శిశు సంక్షేమం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జనగామలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలని వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ నిఖిల సూచించారు.
స్త్రీ శిశు సంక్షేమ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాలు
మహిళలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడుతుందని చెప్పారు. శిశువు పుట్టిన నుంచి పెళ్లి వరకు చాలా వరకు ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అమ్మఒడి, కల్యాణ లక్మి , కేసీఆర్ కిట్ వంటివి ఉచితంగా అందిస్తుందని చెప్పారు. వివిధ శాఖల్లో ఉత్తమమైన ప్రతిభ కనబర్చిన వారికి నిఖిల సన్మానం చేశారు.
ఇవీ చూడండి:రామోజీ ఫిల్మ్ సిటీలో 'వసుంధర' పురస్కారాలు