జనగామ నియోజకవర్గంలో ఓటేసిన ప్రముఖులు - ponnala
లోక్ సభ ఎన్నికలు ప్రశాంత ముగిశాయి. జనగామలో ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జనగామ నియోజకవర్గంలో ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనగామ మండలం ఎల్లంల గ్రామంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సతీసమేతంగా ఓటు వేశారు. మాటీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రఘునాథపల్లి- ఖిలాషాపూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బచ్చనపేటలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, గండి రామవరంలో జడ్పీ ఛైర్మన్ గద్దల పద్మ, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, మరో పాఠశాలలో డీసీపీ శ్రీనివాస్ రెడ్డి ఓటు వేశారు.