తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం మత్తులో ఓవర్​టేక్​​.. ఇద్దరు మృతి - bikes

మద్యం మత్తులో ఓవర్​టేక్​ చేద్దామనుకునే ఆలోచన రెండు ప్రాణాలను బలిగొంది. జనగామ జిల్లా మేడికుంట వద్ద ముందు వెళ్తున్న కారును లారీ ఓవర్​టేక్​ చేయబోయి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఆ ఘటనలో రిపోర్టర్​ కరుణాకర్​.. అతని స్నేహితుడు రవికిరణ్​ దుర్మరణం చెందారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

By

Published : Jun 10, 2019, 9:53 AM IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

జనగామ జిల్లా బచ్చనాపేట మండలం మేడికుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో లారీ నడుపుతూ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడం వల్ల ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. రఘునాథ పల్లి మండలం మండెలాగూడెం గ్రామానికి చెందిన కరుణాకర్​.. అతని స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనాలపై సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో పెళ్లికి వెళ్తున్నారు. మేడికుంట వద్ద ఎదురుగా వస్తున్న లారీ.. ముందు వెళ్తున్న కారును ఓవర్​టేక్​ చేయబోయి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఆ ఘటనో 26 ఏళ్ల కరుణాకర్​, లాద్నూర్​కు చెందిన రవి కిరణ్​ మృత్యువాత పడ్డారు. మృతదేహాలను పంచనామా నిమిత్తం జనగామ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

ఒక న్యూస్​ ఛానెల్​లో రిపోర్టర్​గా పనిచేస్తున్న కరుణాకర్​ సంవత్సరం క్రితం ప్రేమ వివాహం చేసుకోగా.. అతనికి 8 నెలల బాబు ఉన్నాడు. దీనితో బంధువులు, స్నేహితుల ఆర్థనాదాలతో మండెలాగూడెం విషాదకరంగా మారింది.

ఇవీ చూడండి: రవిప్రకాశ్‌ కేసుపై ఇవాళ హైకోర్టుకు నివేదిక

ABOUT THE AUTHOR

...view details