జనగామ జిల్లా బచ్చనపేట మండల కేంద్రంలోని దుర్గమ్మ ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హుండీ దొంగతనం చేశారు. ఈ దృశ్యాలు నిఘా నేత్రాల్లో నిక్షిప్తమయ్యాయి. ఆలయంలో క్లూస్ టీమ్, పోలీసులు తనిఖీలు నిర్వహించి, ఆధారాలను సేకరించారు. హుండీలో దాదాపు లక్ష రూపాయల నగదు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే తరహాలో గుడిలో రెండు సార్లు దొంగతనాలు జరిగిన ఇప్పటివరకు దొంగలను పోలీసులు గుర్తించలేకపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఆలయంలో దొంగతనం.. లక్ష నగదు అపహరణ - జనగామ జిల్లా బచ్చనపేట మండల కేంద్రం
జనగామ జిల్లా బచ్చన్నపేటలోని ఓ ఆలయంలో దొంగతనం జరిగింది. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. దాదాపు లక్ష నగదు పోయినట్లు సమాచారం.
ఆలయంలో దొంగతనం