జనగామ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట పూసల కులస్థులు ధర్నాకు దిగారు. తమ కులాన్ని వెంటనే ఎంబీసీ జాబితాలో చేర్చాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా తమను సంచార జాతుల జాబితా నుంచి తొలగించిందని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో సంచార జాతులుగా పరిగణించిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు తొలగించిందో అర్థం కావడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో సంచార జాతులుగా పరిగణిస్తుంటే... తెలంగాణలో ఎందుకు తొలగించారంటూ వారు ప్రశ్నించారు.
పూసల కులాన్ని 'ఎంబీసీ'లో చేర్చాలి - జనగామ జిల్లా
జనగామ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట పూసల కులస్థులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ కులాన్ని ఎంబీసీ (వెనుకబడిన తరగతుల) జాబితాలో చేర్చాలంటూ డిమాండ్ చేశారు.
పూసల కులాన్ని 'ఎంబీసీ'లో చేర్చాలి