జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థి నీల అరవింద్ కుటుంబాన్ని భాజపా నేత బండారు దత్తాత్రేయ పరామర్శించారు. పార్టీ శ్రేణులతో కలిసి బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు 25 లక్షల పరిహారం చెల్లించాలన్నారు.
'ప్రభుత్వ వైఫల్యం వల్లే విద్యార్థుల ఆత్మహత్యలు' - BJP LEADER BANDARU DATTATHREYA
జనగామ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థి నీల అరవింద్ కుటుంబాన్ని కేంద్ర మాజీ మంత్రి, భాజపా నేత దత్తాత్రేయ పరామర్శించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు వెంటనే 25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు
విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలి : దత్తాత్రేయ