ఆటలతో ఆరోగ్యం - STUDENTS
ఒకప్పుడు ఖాళీ సమయం దొరికితే పిల్లలు ఆటలాడేవారు. ఇప్పుడు పాఠశాలల్లో మైదానాలు లేక కంప్యూటర్, సెల్ఫోన్లలోనే సమయం గడుపుతున్నారు. ఈ పరిస్థితిని మార్చేలా కొన్ని పాఠశాలల్లో ఆటలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. క్రీడలపై విద్యార్థులకు ఆసక్తి పెంచేందుకు జనగామ జిల్లాలోని ఓ పాఠశాలలో స్పోర్ట్స్డే ఘనంగా నిర్వహించారు.
ఆటలతో ఆరోగ్యం
ప్రారంభంలో విద్యార్థులు చేసిన జానపద నృత్యాలు, ఏరోబిక్, యోగా, కర్ర సాము ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాఠశాల యాజమాన్యం విద్య బోధించడమే కాక వివిధ రంగాలలో విద్యార్థులను ప్రోత్సహించడం సంతోషంగా ఉందని బుర్రావెంకటేశం పేర్కొన్నారు. ఆటలలో రాణించిన విద్యార్థులకు ముఖ్య అతిథులు బహుమతులు అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో ఎదగాలని ఆకాంక్షించారు.