జనగామ జిల్లా కేంద్రంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు సోదాలు చేపడతామని డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రజలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాలనీ వాసులందరు కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీని వల్ల నేరాలు జరిగినప్పుడు నిందితులను త్వరగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు ఎవ్వరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిర్బంధ తనిఖీలు - నిర్బంధ తనిఖీలు
నేరాలను కట్టడి చేసేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు నిర్బంధ తనిఖీలు చేపడుతున్నారు. అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
పోలీసులు