తెలంగాణ

telangana

ETV Bharat / state

తొలిసారి నియోజకవర్గ పర్యటనలో నూతన ఎమ్మెల్యేలు - ఘనస్వాగతం పలికిన పార్టీ కార్యకర్తలు - Mahalakshmi Scheme Implemented in Telangana

People Grand Welcome to New MLAs in Telangana : రాష్ట్ర శాసనసభలో శాసనసభ్యులుగా ప్రమాణం చేశాకా, మొదటిసారి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన నూతన ఎమ్మెల్యేలకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. కొత్త శాసనసభ్యులకు పార్టీ కార్యకర్తలు, అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Mahalakshmi Scheme Implemented in Telangana
People Grand Welcome to New MLAs in Telangana

By ETV Bharat Telangana Team

Published : Dec 11, 2023, 10:07 PM IST

People Grand Welcome to New MLAs in Telangana :అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు, శాసన సభలో ప్రమాణస్వీకార అనంతరం సొంత నియోజకవర్గాలకు వెళ్లారు. రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar), తొలిసారిగా గజ్వేల్‌కు చేరుకున్నారు. దీంతో పొన్నంకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.

ఇచ్చిన మాట ప్రకారం6 గ్యారంటీలను 100 రోజుల్లో ప్రారంభిస్తామని మరోసారి పొన్నం స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్యకు పార్టీ శ్రేణులు భారీ ప్రదర్శనతో స్వాగతం పలికారు. మరోవైపు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఏరియా ఆస్పత్రిలో ఆరోగ్య శ్రీ పథకం పరిమితి పెంపును ఎమ్మెల్యే జైవీర్‌ ప్రారంభించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఆదేశిస్తాం - నీటి వాటా విషయంపై కేంద్రంతో చర్చిస్తాం : ఉత్తమ్​

జనగామ జిల్లా చిల్పూర్ మండలం, శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామిని(Lord Venkateswara Swamy) దర్శించుకోవాడానికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పండితుల నుంచి ఆశీర్వాచనం అందుకున్న కడియం, నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం నియోజకవర్గానికి వచ్చిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

చిల్పూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో , ప్రజలందరి సహకారంతో స్టేషన్ ఘన్​పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాను. గత ప్రభుత్వం ఈ దేవాలయ అభివృద్ధికి రూ. 10 కోట్లు మంజూరు చేయటం జరిగింది. ఆ పనులకు త్వరలోనే టెండర్లు పిలిచి ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాను.-కడియం శ్రీహరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్​ను పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు

ప్రముఖ పుణ్యక్షేత్రం హనుమకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే, మహిళలకు ఉచిత ప్రయాణం సేవలను ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు ఎమ్మెల్యే హోదాలో వచ్చిన బీర్ల ఐలయ్యను, ఆలేరు పట్టణంలోని పాల సెంటర్ నుంచి, సామాజిక ఆరోగ్య కేంద్రం(Social Health Centre) వరకు కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున స్వాగతం పలికారు.

Mahalakshmi Scheme Implemented in Telangana : ఆలేరు నియోజకవర్గ పరిధిలో ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం మహాలక్ష్మి పథకంను, ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకాన్ని సోమవారం నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్యసాయం రూ.10 లక్షల పెంపు కార్యక్రమం చేపట్టారు. రెండు పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. కొత్తగూడెంలో సాంభశివరావు విజయాన్ని కాంక్షిస్తూ మిత్రపక్షాలు, భారీ ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా కూనమనేనితో పాటు పలువురు నాయకులు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ముందుకు కదిలారు.

జేబీఎస్​ బస్టాండ్​లో సజ్జనార్​ - ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్న ఆర్టీసీ ఎండీ

ఉచిత ప్రయాణ సౌకర్యం - మహిళలతో కిటకిటలాడుతున్న బస్సులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details