సమీప తండాలో నివాసముంటున్న కుమారుని ఇంటికి కాలినడకన వెళ్తున్న ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు రిజర్వాయర్ నీటిలో పడి దుర్మరణం చెందిన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం వేపలగడ్డ తండాలో చోటు చేసుకుంది. వేపల గడ్డతండాకు చెందిన భూక్యా సంగ్యా భార్య భాగి(75) అనే వృద్ధురాలికు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా వివాహాలు చేసింది. భర్త రెండేళ్ల కిందట చనిపోవడం వల్ల చిన్న కుమారుని ఇంటివద్ద నివసిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ తండాకు సమీపంలో ఉన్న సేవ్యాతండాలో నివాసముంటున్న పెద్ద కుమారుడు బాలు ఇంటికి ఆమె కాలినడకన వెళ్తుండగా, మార్గం మధ్యలో ఉన్న కల్వర్టు వద్దకు చేరుకున్నాక అశ్వరావుపల్లి రిజర్వాయర్ నీటిలో ప్రమాద వశాత్తు పడిపోయింది. ఆ విషయాన్ని ఎవరూ గమనించకపోవడం వల్ల నీటిలో మునిగి మృతి చెందింది.
రిజర్వాయర్ నీటిలో పడి వృద్ధురాలు మృతి - jangaon district news
ప్రమాదవశాత్తు ఓ వృద్ధురాలు రిజర్వాయర్ నీటిలో పడి మృతి చెందిన ఘటన జనగామ జిల్లాలోని వేపలగడ్డ తండాలో జరిగింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. వృద్ధురాలి మృతితో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తన తల్లి ఇంకా ఇంటికి చేరుకోలేదని పెద్ద కుమారుడు బాలు ఆ తండావాసులతో ఆరా తీయడం వల్ల అందరూ కలిసి రిజర్వాయర్ నీటి పరిసరాల్లో వెతకగా.. మృతురాలి చేతి కర్ర, సంచి నీటిలో తేలుతూ కనిపించాయి. దీంతో యువకులు రిజర్వాయర్ నీటిలో గాలించగా ఆ వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న ఎస్సై కందుల అశోక్ కుమార్ నేతృత్వంలో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టగా... తమ తల్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందిందే గాని ఎవరిమీద ఎలాంటి అనుమానం లేదని మృతురాలి కుమారులు తెలిపారు. కాగా ఆమె మృతితో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చూడండి: అనారోగ్యంతో.. మహిళ ఆత్మహత్య!