తెలంగాణ

telangana

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు - sanitization labour

జనగామ మున్సిపల్​ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు జిల్లా కలెక్టర్​ నిఖిల వైద్యపరీక్షలు చేయించారు. వారికి మాస్కులు, శానిటైజర్లు, మందులు, గ్లౌజులను పంపిణీ చేశారు.

medical tests to sanitization labour in jangaon district
పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు

By

Published : May 14, 2020, 8:06 PM IST

కరోనా కట్టడిలో పారిశుద్ధ్య కార్మికులది ముఖ్యమైన పాత్రని, ఇంతమంది ఆరోగ్యాలను కాపాడుతున్న వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని జనగామ జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు. జనగామ మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు జిల్లా వైద్య సిబ్బందితో వైద్య పరీక్షలు నిర్వహించారు.

అనంతరం వారికి కావాల్సిన మందులు, మాస్కులు, శానిటైజర్లు, సబ్బులు, కొబ్బరి నూనె, చేతి తొడుగులను మున్సిపల్ ఛైర్​పర్సన్​ జమునతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మహేందర్ రెడ్డి, సూపరింటెండెంట్​ రఘు, ఆర్​ఎంవో సుగుణాకర్ రాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: వలస కూలీల్లో కరోనా... ఉలిక్కిపడ్డ గ్రీన్​జోన్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details