తెలంగాణ

telangana

ETV Bharat / state

అమ్మాయి కోసం స్నేహితుల గొడవ..ఆత్మహత్య..! - sai

ఆ ముగ్గురు మంచి స్నేహితులు. కానీ ఓ  అమ్మాయి విషయంలో గొడవ జరిగింది.  ఒకరినొకరు కొట్టుకున్నారు. మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.

సాయి ప్రసాద్

By

Published : Jun 6, 2019, 6:54 PM IST

Updated : Jun 6, 2019, 7:11 PM IST

జనగామ జిల్లా వీవర్స్​ కాలనీ శివారులో రైల్వే పట్టాలపై బోగ సాయి ప్రసాద్​ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు రాత్రి సాయితో గొల్లపల్లి పవన్​, వరుణ్​ గొడవ పడ్డారు. ఓ అమ్మాయి విషయంలో పవన్ చేయిచేసుకున్నాడు. మనస్తాపం చెందిన సాయి..తన ఇంటి సమీపంలోని రైలు పట్టాలపై బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే ముందు ఆత్మహత్యకు ఎవరో కారణమే లేఖ రాశాడు. తన చావుకు పవన్, వరుణ్​లే కారణమని..వాళ్లను ఏం చేసినా పాపం లేదని అందులో పేర్కొన్నాడు. మృతుని బంధువులు నిందితుల ఇంటి ముందు సాయి మృతదేహంతో ఆందోళన చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మనస్తాపంతో ఆత్మహత్య
Last Updated : Jun 6, 2019, 7:11 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details