'రెండు పడకల గదుల నిర్మాణానికి భూమి పూజ' - స్థానిక మహిళలు
రెండు పడకల గదుల నిర్మాణానికి జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శంకుస్థాపన చేశారు. త్వరలోనే నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని స్పష్టం చేశారు.
మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదని మహిళల ధర్నా
జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని బీడీ కాలనీలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి శంకుస్థాపన చేశారు. కట్కూరు గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ నిర్మాణానికి జడ్పీ ఛైర్మన్ సంపత్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. స్థానిక మహిళలు మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదని ఖాళీ బిందెలతో ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలించారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.