తెలంగాణ

telangana

ETV Bharat / state

పకడ్బందీగా పదో తరగతి వార్షిక పరీక్షలు: డీఈఓ

జనగామ జిల్లా స్టేషన్​ ఘన్​పూర్​లోని పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని డీఈవో యాదయ్య... మండల విద్యాధికారులతో కలిసి తనిఖీ చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. భౌతిక దూరం, మాస్కులు ధరించటం లాంటి జాగ్రత్తలు పక్కాగా తీసుకోవాలన్నారు.

janagama deo visited 10th class exam center in station ganpur
పకడ్బందీగా పదో తరగతి వార్షిక పరీక్షలు

By

Published : Jun 5, 2020, 7:26 PM IST

ఈనెల 8 నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలను లాక్​డౌన్ నిబంధనలకు అనుగుణంగా జరుపనున్నట్లు జనగామ జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ యాదయ్య తెలిపారు. స్టేషన్ ఘన్​పూర్​లోని పరీక్షా కేంద్రాన్ని మండల విద్యాధికారులతో కలిసి తనిఖీ చేశారు.

పరీక్షల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను మండల విద్యాధికారులకు సూచించారు. విద్యార్థులు భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలకు వచ్చే ముందు విద్యార్థులు విధిగా మాస్కులు ధరించాలని... పరీక్షా కేంద్రానికి వచ్చాక చేతులను శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు. కేంద్రాలలో విద్యార్థుల సంఖ్య తగ్గించి పరీక్షా కేంద్రాలను పెంచినట్టు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఆర్టీసీ ఆధ్వర్యంలో రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు యాదయ్య పేర్కొన్నారు.

ఇవీచూడండి:మహారాష్ట్రలో రికార్డు స్థాయి కరోనా మరణాలు

ABOUT THE AUTHOR

...view details