జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్‌లో నీల అరవింద్ అనే ఇంటర్ విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నర్మెట్టలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న అరవింద్ మూడు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. హైదరాబాద్‌కు వలస వెళ్లిన తల్లిదండ్రులు బుధవారం రాత్రి స్వగ్రామనికి వచ్చారు. కుమారుడు ఫెయిలైన విషయం తెలుసుకొని మందలించి తిరిగి వెళ్లిపోయారు. మనస్తాపం చెందిన విద్యార్థి ఈ దారుణానికి పాల్పడ్డాడు.
తల్లిదండ్రులు మందలించారని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య - janagama district
ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నా, ప్రభుత్వం న్యాయం చేస్తామని భరోసా ఇస్తున్నా... ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. జనగామ జిల్లాలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు ఓ విద్యార్థి.
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య