వరంగల్ తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. గ్రామ వాసులు తమకు గోదావరి నీళ్లతో చెరువులు నింపాలని కోరారు. స్పందించిన మంత్రి నాలుగు నెలల కాలంలో కాల్వలు పూర్తిచేసి నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో తెరాస అభ్యర్థిని గెలిపిస్తేనే నీళ్లు వస్తాయని అన్నారు.
'వరంగల్ తెరాస అభ్యర్థిని గెలిపిస్తేనే గోదావరి జలాలు'
తెరాస ఎన్నికల ప్రచారంలో జోరుగా దూసుకెళ్తోంది. వరంగల్ తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహంచి ఓట్లు అభ్యర్థించారు మంత్రి ఎర్రబెల్లి.
తెరాస అభ్యర్థిని గెలిపిస్తేనే గోదావరి నీళ్లు : మంత్రి దయాకర్ రావు