తెలంగాణ

telangana

ETV Bharat / state

మిరప సాగు తెలుసుకునేందుకు విదేశీయుల పర్యటన - CHILLI

భారతదేశంలో మిర్చి పంటను పండించే విధానాన్ని తెలుసుకునేందుకు యూరోపియన్ ప్రతినిధులు జనగామ జిల్లా రామన్నగూడెంకి వచ్చారు. తాము దిగుమతి చేసుకునే పంటపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతన్నలు చేసిన కష్టాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

CJILLI

By

Published : Feb 1, 2019, 3:14 AM IST

CHILLI
తాము దిగుమతి చేసుకునే మిరప పంటను ఎలా పండిస్తారో తెలుసుకునేందుకు యూరోపియన్ ప్రతినిధులు జనగామ జిల్లా రామన్నగూడెంలో పర్యటించారు. ఈ గ్రామంలో ఐటీసీ సంస్థ సహకారంతో ఎక్కువ మంది రైతులు మిరప పంటలనే పండిస్తున్నారు. వీరు పండించిన పంటను ఐటీసీ సంస్థ కొనుగోలు చేసి యూరప్​కు ఎగుమతి చేస్తోంది. రైతన్నలకు సంహారక మందులు తక్కువ మోతాదులో వాడుతూ... ఎక్కువ దిగుబడి ఎలా సాధించాలో సలహాలు ఇస్తున్నారు ఐటీసీ సంస్థ ప్రతినిధులు. అంతే కాకుండా బయట మార్కెట్​లో వచ్చే ధరకంటే ఎక్కువ ధరకి కొనుగోలు చేస్తున్నారు. రవాణా, ఇతర ఖర్చులను కూడా రైతన్నల దగ్గర నుంచి వసూలు చేయకపోవడంతో కర్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఐటీసీ సంస్థ ప్రతినిధులు మిరప పంటను పండిచేందుకు రైతులు అవలంభిస్తున్న పద్దతులను స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేసి విదేశీ బృందానికి వివరించారు. అనంతరం మిరపకాయలను ఎండబోసిన స్థలానికి తీసుకెళ్లి అరబెట్టు విధానాన్ని తెలిపారు. విదేశీ ప్రతినిధులు మాట్లాడుతూ.. పంట పండించే విధానం సంతృప్తిగా ఉందని, నాణ్యమైన పంటలను పండిస్తున్న రైతులకు కృతఙ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details