తెలంగాణ

telangana

ETV Bharat / state

జనగామలో కుటుంబం ఆత్మహత్యాయత్నం - SUCIDE

ఇరవై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి మీది కాదన్నారు. దున్నేందుకు వెళ్తే... బెదిరించారు, భయపెట్టారు. భూమి లేని బతుకు ఎందుకని మనస్తాపం చెంది కుటుంబమంతా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

మనస్తాపంతోనే...!

By

Published : Mar 13, 2019, 11:56 PM IST

Updated : Mar 14, 2019, 1:13 AM IST

మనస్తాపంతోనే...!
జనగామ జిల్లా బచ్చనపేట మండలం కేసిరెడ్డిపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. బద్దిపడిగెల మాధవరెడ్డి అనే వ్యక్తి 20 సంవత్సరాల క్రితం బాల్​రెడ్డి వద్ద కొంత భూమి కొని సాగు చేసుకుంటున్నాడు. ఆ భూమిని తన పేరు మీద పట్టా చేసుకోనివ్వటంలేదని మనస్తాపం చెందిన మాధవ రెడ్డి... భార్య, కొడుకుతో కలిసి పురుగుల మందు తాగారు. విషయం గుర్తించిన ఇరుగుపొరుగు వారు ముగ్గురిని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.ఇన్నేళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని దున్నొద్దంటూ బాల్​రెడ్డి అడ్డుపడుతున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు.భూమిని తమ పేరు మీద పట్టా చేయించి న్యాయం చేయాలంటూ బాధితులు కోరుతున్నారు.
Last Updated : Mar 14, 2019, 1:13 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details