జనగామ మండలం ఎర్రగొల్లపహడ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గిరిజనుల ఇళ్ల స్థలాల్లో పల్లె పార్కు కోసం రెవెన్యూ అధికారులు ప్రభుత్వ బోర్డు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా... స్థానికులు అడ్డుకున్నారు. తమ స్థలాలను ఇచ్చేది లేదని గిరిజనులు.. నియమ నిబంధనల మేరకు స్థలాలను స్వాధీన పరుచుకుంటామని రెవెన్యూ అధికారులు వాదోపవాదనలు చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు, అధికారులు గిరిజనుల నివాస స్థలాల్లో ఎట్టకేలకు ప్రభుత్వ బోర్డును ఏర్పాటు చేశారు.
ఉద్రిక్తతకు దారి తీసిన పల్లె పార్కు బోర్డు ఏర్పాటు
పల్లె పార్కు కోసం రెవెన్యూ అధికారులు ప్రభుత్వ బోర్డు ఏర్పాటు చేసే ప్రయత్నం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ ఘటన జనగామ మండలం ఎర్రగొల్లపహడ్‌లో చోటుచేసుకుంది. అధికారులకు, గిరిజనులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా... పోలీసుల రంగ ప్రవేశంతో ఘటన సద్దుమణిగింది.
erragollapadu villagers protesed aginst palle park board
ఏసీపీ వినోద్‌కుమార్, సీఐ మల్లేశ్‌యాదవ్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఘటనను పర్యవేక్షించారు. గ్రామ సర్పంచి వంగాల రేణుక, మాజీ ఎంపీపీ యాదగిరి, నాయకులు వినోద్, వెంకటేశ్, మాజీ సర్పంచి బైరగోని చంద్రం, వంగాల శంకర్, చిర్ర సత్యనారాయణరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి నివాస స్థలాలు, డబుల్ బెడ్‌రూంలు మంజూరయ్యాక కేటాయింపులు చేస్తామని తహసీల్దార్ రవీందర్ స్థానికులకు హామీ ఇచ్చారు.